హైదరాబాద్: నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (కెడిడబ్లూ ఎస్‌పి) ఫేజ్ 1కు సంతోషన్‌గర్ వద్ద జలమండలి జంక్షన్ పనులు చేపట్టనుంది ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా సంతోష్‌నగర్, జంక్షన్ వద్ద జరుగుతున్న నల్గొండ ఓవైసీ హాస్పటల్ ఫ్లై ఓవర్ డౌన్ ర్యాంప్ పిల్లర్ల అలైన్‌మెంట్ కింద కెడబ్లూఎస్‌పి ఫేజ్ 1కు చెందిన 450 ఎంఎం డయా, 600 ఎంఎం డయా పైప్‌లైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పైప్‌లైన్లను పక్కకు జరిపేందుకు జంక్షన్ పనులు నిర్వహించాలని తద్వా ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆటంకాలు తొలగించాలని జలమండలి నిర్ణయించింది. నేడు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలవరకు పనులు సాగుతాయని 24 గంటల పాటు ఫేజ్ 1కింద ఉన్న రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బోర్డు తెలిపింది.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు ఇవే…
మీరాలాం, కిషన్‌బాగ్, అలీ జుబైల్ కాలనీ, సంతోష్‌నగర్, వినయనగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌ఘడ్ ,యాకత్‌ఫురా,మాదన్నపేట, మహబూబ్ మాన్షన్,రియాసత్‌నగర్, అలియాబాద్, బొగ్గుల కుంట, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌షుక్‌నగర్, బొంగుళూరు,మన్నెగూడ, రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫర ఉండదదని తెలిపారు. వినియోగదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.