- Advertisement -
కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ)ను మరో మూడేళ్లు కొనసాగించడానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2021 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఈ పథకాన్ని కొనసాగించడానికి క్యాబినెట్ ఆమోదించినట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరి కోసం గృహ నిర్మాణం చేపట్టడమే ఈ పథకం లక్షమని ఆయన చెప్పారు. మిగిలిన 155.75 లక్షల ఇళ్లను నిర్మించడానికి ఈ పథకం కొనసాగింపు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. మొత్తం 2.95 కోట్ల పక్కా గృహాలు నిర్మించడమే ఈ పథకం లక్షమని ఆయన చెప్పారు. మిగిలిన గృహాల నిర్మాణానికి దాదాపు రూ. 1,98,591 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
- Advertisement -