- Advertisement -
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, అనేక మంది ఇతర అధికారులు ప్రయాణించిన భారత వాయుసేన హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిన సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరణ ఇచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆయన ఈ దుర్ఘటనను పర్యవేక్షిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్, రావత్ ఇంటికి వెళ్లి ఆయన కూతురితో మాట్లాడారు. ఈ దుర్ఘటనపై రక్షణ మంత్రి పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. హెలికాప్టర్ సూలూరులోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణించారు. కూలిన ప్రదేశంలో నాలుగు భౌతిక కాయాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై విచారణ (కోర్ట్ ఆఫ్ ఇంక్వయిరీ)కి ఆదేశించినట్లు భారత వాయుసేన తెలిపింది.
- Advertisement -