Friday, November 15, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

ఓటు హక్కు వినియోగించు కోనున్న 305 మంది ఓటర్లు
కొత్తగూడెం, భద్రాచలంలో పోలింగ్ కేంద్రాలు

MLC Elections completed

మన తెలంగాణ/కొత్తగూడెం : ఈనెల 10వ తేది జరగనున్న స్దానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఆర్డివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీంగ్ కేంద్రా న్ని వీరువురు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తొమ్మిది మంది జడ్పీటీసిలు, 75 మంది ఎంపిటిసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారని, వీరిలో 34 మంది పురుషులు, 50 మంది మహిళలు ఉన్నట్లు వివరించారు. కొత్తగూడెం ఆర్డివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 60మంది కౌన్సిలర్లు, 14 మంది జడ్పీటీసీలు, 145 ఎంపిటీసీలు, ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు మొత్తం 221 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు. వీరిలో 86మంది పురుషులు, 135మంది మహిళలు ఉన్నారని వివరించారు. ఈ రెండు పోలీంగ్ కేంద్రాల్లో ఓటింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. పోలీంగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, చేయాల్సినవి, చేయకూడనివి వాటి సమాచారం ఏర్పాటు చేయాలని చెప్పారు.

సెక్టోరియల్ అధికారులుగా భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడె ఆర్డివో వ్యవహరిస్తారని చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాలగురించి సెక్టోరియల్ అధికారులతో చర్చించారు. నేటి నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాల నిలుపుదలపై తహసీల్దార్లు, ఎక్సైజ్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలన్నారు. ఓటు హక్కు వినయోగంలో ఓటర్లు పోలింగ్ కేంద్రం సిబ్బంది ఇచ్చిన పెన్నును మాత్రమే వినియోగించి పోటీ చేస్తొన్న అభ్యర్ధులకు ఎదురుగా ప్రాధ్యాన్యత క్రమంలో నెంబర్లు వేయాలని, టిక్స్ కాని, రాయడం కాని చేసిన అటువంటి ఓటు చెల్లుబాటు కాదని చెప్పారు. ఓటుహక్కు వినియోగం పూర్తీగా రహస్యమని, వినియోగాన్ని బట్టబయలు చేయడం ఎన్నికల సంఘం ఉత్తర్వులు ప్రకారం నిషేధమని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని, ఓటర్లు వాటిని లోనికి తీసుకెళ్లరాదని అన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బారికేడింగ్ ఏర్పాటుచేయాలన్నారు. ఓటర్లు తప్ప ఎవరిని అనుమతించరని వివరించారు.

ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీంగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌన్సిలర్లను, ఎంపిటిసీలను గుర్తించడానికి మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడివోలను కేటాయించినట్లు తెలిపారు. పోలీంగ్ మెటిరియల్ తీసుకోవడంలోను, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఖమ్మం రిసెప్షన్ సెంటర్‌లో అప్పగించే వరకు పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.మెటిరియల్ అప్పగించిన తర్వాత చెక్‌లిస్ట్ ఆధారంగా అన్ని సక్రమంగా ఉ న్నట్లు ధృవీకరణ జరిగిన తర్వాత మాత్రమే వెళ్లాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు రాజకీయ పార్టీలు మెసెజ్‌లుకాని, ప్రచారాఆలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, సోషల్ మీడియాలో కూడా ఎటువంటి ప్రచారం నిర్వహించరాదని వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ స్వర్ణలత, డిఆర్‌ఓ అశోక్‌చక్రవర్తి, జడ్పీసీఈవో విద్యాలత, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, తహసీల్దార్లు రామకృష్ణ, క్రిష్ణప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News