న్యూఢిల్లీ: భారత్ లో శుక్రవారం మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి ముంబై వచ్చిన వ్యక్తికి కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మూడు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ముంబైలో 1. గుజరాత్ లో రెండు కేసులు బయపడ్డాయి. బాధితుడికి ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒమిక్రాన్ బాధితులు ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అయితే ఒమిక్రాన్ బాధితుడిలో లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 11 ఒమిక్రాన్ కేసులు, రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 3, కర్నాటకలో 2, ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదయ్యాయి కేంద్ర ప్రకటించింది. ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్పలక్షణాలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Another Omicron case in India