హైదరాబాద్ రీజియన్ మేనేజర్ వెంకన్న
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామినే దర్శించుకునే భక్తుల కోసం ఆర్టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రతి రోజు 2 వజ్రా బస్సులను యాదాద్రి నడనపునున్నట్లు హైదరాబాద్ రీజియన్ మేనేజర్ సిహెచ్. వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు లింగంపల్లి, జేబీఎస్ల నుంచి బయలుదేరుతాయన్నారు. లింగంపల్లి నుంచి ఉదయం 6.40 గంటల నిమిషాలకు , 7.25 గంటలకు బయలు దేరుతుండగా జేబిఎస్ నుంచి బయలుదేరే బస్సులు ఉదయం 7.45 , 8.30, గంటలకే అదే విధంగా మధ్యాహ్నాం 1.30 గంటలకు 2 గంటల 15 ఉంటాయన్నారు. యాదాద్రి నుంచి నగరానికి ఉదయం.10 గంటల 15 నిమిషాలకు, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, , 4 గంటల 45 నిమిషాలకు బయలు దేరుతాయన్నారు. యాదాద్రికి వెళ్ళే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ప్రయాణికులు తమ అమూల్యమైన, సలహాలు, సూచనలను సంస్థకు అందచేసి సంస్థ అభివృద్దికి సహకరించాలని కోరారు.