Saturday, November 23, 2024

కొట్టుకపోయిన ఆలయాల పునఃనిర్మాణం చేపడుతాం: టిటిడి

- Advertisement -
- Advertisement -

TTD

తిరుపతి: టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకంది. జనవరి 13న వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభించనుంది. పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టిటిడి పేర్కొంది. 11 మంది చిన్న పిల్లలకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేశామని, హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నాదనీరాజనం మండలం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామని టిటిడి వెల్లడించింది. అన్నమయ్య ప్రాజెక్టు వద్ద కొట్టుకపోయిన ఆలయాలను పునఃనిర్మాణం చేపడుతామన్నారు. ఐటి విభాగాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తామన్నారు. రూ.2.6 కోట్లతో నూతన పరకామణ మండపంలో యంత్రాలు కొనుగోలు చేస్తామన్నారు. శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారం తాపడం పనులు చేపట్టామని టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News