వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా పాలసీ అడ్వైజర్ గౌతమ్ రాఘవన్‌కు పదోన్నతి లభించింది. రాఘవన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ( పిపిఓ) అధిపతిగా రాఘవన్‌కు పదోన్నతి కల్పించారు. వైట్‌హౌస్ పిపిఓను ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్‌గా కూడా పిలుస్తారు. వైట్‌హౌస్‌లో జరిగే కొత్త అపాయింట్‌మెంట్లను పిపిఓ ఆఫీస్ పర్యవేక్షిస్తుంది. శ్వేతసౌధంలో పని చేసే అభ్యర్థులను పిపిఓ ఆఫీస్ పూర్తిగా పరిశీలించి రిక్రూట్ చేస్తుంది. గౌతమ్‌రాఘవన్ ప్రస్తుతం పిపిఓ డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్నారు. అయితే పిపిఓహెడ్‌గా ఉన్న క్యాథీ రస్సెల్‌కు ఇటీవల కొత్త పదవి దక్కింది. యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రస్సెల్ వెళ్తున్నారు. దీంతో ఆయన స్థానంలో ఖాళీ అయిన పోస్టుకు రాఘవన్‌కు పదోన్నతి కల్పించారు.
క్యాథీ రస్సెల్‌తో కలిసి రాఘవన్ బాగా పని చేశారని, పిపిఓ కొత్త డైరెక్టర్‌గా రాఘవన్ బాధ్యతలు చేపడతారని బైడెన్ పేర్కొన్నారు. గౌతమ్ రాఘవన్ భారత్‌లో పుట్టారు, సియాటిల్‌లో పెరిగారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ‘ వెస్ట్ వింగర్స్: స్టోరీస్ ఫ్రమ్ ది డ్రీమ్ చేజర్స్, చేంజ్ మేకర్స్, హోప్‌క్రియేటర్స్.. ఇన్‌సైడ్ ది ఒబామా వైట్‌హౌస్’ అనే పుస్తకానికి ఆయన ఎడిటర్‌గా పని చేశారు. రాఘవన్ వయసు 40 ఏళ్లుపైగానే. ఆయన స్వలింగ సంపర్కుడు. భర్త, కుమార్తెతో కలిసి వాషింగ్టన్ డిసిలో నివసిస్తున్నారు. 2020 జనవరి20నుంచి అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా ఉన్నారు. బైడెన్‌హారిస్ పరిపాలనా విభాగం తొలుత రిక్రూట్ చేసింది రాఘవన్‌నే.