పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మహానటి దర్శకుడు నాగ్అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్). బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ప్రభాస్, దీపికా పదుకొణె మధ్య కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ వ్యయంతో కొత్త ప్రపంచాన్ని సెట్‌గా రూపొందించారు. ప్రభాస్, దీపికా పదుకొణె మీద మొదటి షాట్‌ను తీశారు. ఈ సందర్భంగా ‘ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ వరల్డ్ బిగ్గెస్ట్ కెమెరా కోసం చేతులు కలిపారు’ అని చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె చేతులు కలపడం మనం చూడొచ్చు. వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించనున్నారు.