Sunday, November 17, 2024

ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు

- Advertisement -
- Advertisement -

The first Omicron case dected in AP

దేశంలో 38కి పెరిగిన కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఎపి వైద్యారోగ్య శాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. గత నెల 27న ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ముంబైలో ఆర్‌టిపిసిఆర్ టెస్టులో కొవిడ్ నెగిటివ్‌గా తేలింది. విజయనగరంలో మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం హైదరాబాద్‌లోని సిసిఎంబికి పంపించగా, 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని, అందులో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్టు తేలిందని ఎపి వైద్యారోగ్య శాఖ వెల్లడింది.

కొత్తగా 160 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 30,859 మందికి పరీక్షలు నిర్వహించగా, 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఎపి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొవిడ్‌తో ఒకరు మృతి చెందినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో 201 మంది కొవిడ్ బాధితులు కోలుకున్నారు. ఆదివారం టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,77,396కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,868కు పెరుగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,58,490కి చేరింది. ప్రస్తుతం ఎపిలో 1,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News