Saturday, November 16, 2024

చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భద్రతా కారణాల దృష్టా చార్‌ధామ్ ప్రాజెక్టు కోసం డబుల్ లేన్ రోడ్ల వెడల్పునకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ప్రాజెక్టుపై నేరుగా తమకు నివేదికలు అందచేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె సిక్రి సారథ్యంలో ఒక పర్యవేక్షణ కమిటీని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నియమించింది. ఈ కమిటీకి రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖలతోపాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. రూ.12,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 900 కిలోమీటర్ల పొడవైన చార్‌ధామ్ ప్రాజెక్టు ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీ నాథ్‌లను కలుపుతుంది.

Supreme Court approves Char Dham Road Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News