ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నాడని.. అందుకే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండటంలేదని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ”సౌతాఫ్రికా జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటా. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవు. రోహిత్ మంచి కెప్టెన్. రోహిత్ కెప్టెన్సీలో ఆడటానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వన్డేలు ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కెప్టెన్ గా లేకపోయినంతమాత్రాన నిరుత్సాహపడను. నేను కెప్టెన్ గా జట్టు కోసం వందశాతం శ్రమించా. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని నేను చెప్పినప్పుడు బిసిసిఐ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. వన్డేలకు, టెస్టులకు కెప్టెన్ గా కొనసాగుతానని చెప్పా. గతవారం దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించే గంట ముందు నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ చెప్పారు” అని కోహ్లీ తెలిపాడు.
Kohli Press Conference ahead South Africa Tour