సిద్ధిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్ధిపేట అర్బన్ మండలంలోని 77మంది అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున రూ.77,08,932 విలువ కలిగిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెళ్లీల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు.
Harish Rao distributes Kalyana Lakshmi Cheques