Saturday, November 23, 2024

దేశం కోసం 32 తూటాలకు బలయిన ఇందిరను విస్మరిస్తారా?

- Advertisement -
- Advertisement -

Indira Gandhi took 32 bullets but ignored on 1971 War anniversary

కేంద్రం తీరుపై కాంగ్రెస్ ధ్వజం

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం దేశవ్యాప్తంగా విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పేరును ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్‌పార్టీ మండిపడింది. నాటి యుద్ధ సమయంలో దేశానికి నాయకత్వం వహించిన మాజీ ప్రధానిని స్మరించుకోకుండా కేంద్రప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది. దేశానికి తొలి, ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీని విజయ్ దివస్ వేడుకలకు ఈ స్త్రీ దేష ప్రభుత్వం దూరం చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా విమర్శించారు. మీ గంభీరప్రకటనలను మహిళలెవ్వరూ నమ్మరని, దేశ భక్తిపై మీ వైఖరి కూడా ఆమోదయోగ్యం కాదంటూ ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేశారు.1971లో జరిగిన యుద్ధానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఇందిరాగాంధీ పేరును కనీసం ప్రస్తావించకపోవడం శోచనీయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

దేశం కోసం 32 తూటాలకు బలైన ఇందిరను విస్మరిస్తారా? అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కేవలం 13 రోజుల్ల్లోనే 1971 నాటి యుద్ధంలో విజయం లభించింది. ఈ విజయం కీర్తి కేవలం సైన్యానిదో, నౌకాదళానిదో, అప్పుడున్న రాజకీయ నాయకత్వందో కాదు. కలుం, మతంతో సంబంధం లేకుండా జాతి యావత్తు చూపిన సంఘటిత పోరాట ఫలితమే ఈ విజయం’ అని రాహుల్ అన్నారు. బంగ్లాదేశ్ విముక్తిలో ఇందిరాగాంధీ పాత్రను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కనీసం ప్రధాని మోడీ కానీ, కేంద్రప్రభుత్వం కానీ ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉక్కు మనిషిగా పేరొంది, దేశాన్ని ముందుండి నడిపించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కూడా ప్రస్తావించకుండా బిజెపి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా దుయ్యబట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News