నేచులర్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీని ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుద ల చేయబోతున్నా రు. ఈ సందర్భం గా గురువారం ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో మా ట్లాడుతూ “ఇందు లో రెండు కథలుంటాయి. ఒకటి నేటి కాలంలో జరుగుతుంది. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్‌లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. సౌత్, నార్త్ ఒకరకమైతే.. బెంగాల్‌లో మరోలా ఉంటుంది. అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించాను. అన్ని సెట్స్ హైదరాబాద్‌లోనే వేశాం. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. టెంపుల్ సెటప్ మేజర్ హైలెట్ అవుతుంది. ఈ సెట్‌ను హైదరాబాద్‌లోనే వేశాం. ఆరు ఎకరాల్లో వేసిన ఈ సెట్ కోసం మూడు నెలల పాటు రోజూ 300 మంది శ్రమించారు. కోల్‌కతా కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకొని ఆ సెట్ వేశాను. ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. నెక్స్ నానితో కలిసి ‘దసరా’ సినిమా చేస్తున్నాను. రవితేజతో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే చిత్రాన్ని చేస్తున్నాను”అని అన్నారు.
సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నా
- Advertisement -
- Advertisement -
- Advertisement -