- Advertisement -
బూస్టర్ డోస్‌పై పరిశీలిస్తున్నాం: కేంద్రం
న్యూఢిల్లీ: బూస్టర్ డోస్‌పై శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని, ప్రస్తుతం మెజార్టీ ప్రజానీకానికి ప్రాథమిక వ్యాక్సినేషన్ అందించడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మనకున్న వ్యాక్సిన్ వనరులు, తదితర అంశాలను శాస్త్రీయంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు నీతిఆయోగ్ సభ్యుడు వికె పాల్ తెలిపారు. వనరులకు కొరత లేనప్పుడు బూస్టర్ డోస్‌పై నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకు మొత్తమ్మీద 136 కోట్ల డోసులకుపైగా పంపిణీ జరగ్గా..82.8 కోట్లమందికి ఒక డోస్ అందగా, అందులో 53.72 కోట్లమంది రెండు డోసులు పొందినవారని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అమెరికాలో పంపిణీ అయినదానికన్నా మన దేశంలో 2.8 రెట్ల డోసులు అధికంగా పంపిణీ అయ్యాయని తెలిపింది.
- Advertisement -