Saturday, November 16, 2024

అత్యాచారాలపై వ్యాఖ్యలకు కాంగ్రెస్ కర్నాటక ఎంఎల్‌ఎ రమేశ్ క్షమాపణ

- Advertisement -
- Advertisement -

Congress Karnataka MLA Ramesh apologizes for comments on rape

 

బెంగళూర్: కర్నాటక అసెంబ్లీలో అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ ఎంఎల్‌ఎ, మాజీ స్పీకర్ కె ఆర్ రమేశ్‌కుమార్ శుక్రవారం క్షమాపణ చెప్పారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే రమేశ్‌కుమార్ లేచి నిలబడి గురువారం తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానంటూ ఓ ప్రకటన చేశారు. అసెంబ్లీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు. తానిక తన వ్యాఖ్యల్ని సమర్థించబోనని, వినయంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. చైనా తాత్వికుడు కన్ఫూజియస్ ప్రసిద్ధ సూక్తిని రమేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తప్పును ఒప్పుకుంటే ఒక్క తప్పుతో ముగుస్తుంది. తప్పు చేయలేదని బుకాయిస్తే అనేక తప్పులు చేయాల్సి వస్తుందన్నది కన్ఫూజియస్ సూక్తి.

గురువారం తన వ్యాఖ్యలతో స్పీకర్‌ను నవ్వేలా చేసినందుకు కూడా తాను క్షమాపణ చెబుతున్నానని రమేశ్ అన్నారు. ఈ అంశంలో నవ్వినందుకు స్పీకర్‌పైనా విమర్శలు రావడం గమనార్హం. రమేశ్ క్షమాపణతో ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని సభ్యులకు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే సూచించారు. కొందరు మహిళా సభ్యులు చర్చకు యత్నించగా అనుమతించలేదు. అత్యాచారం అనివార్యమైనపుడు ఆస్వాదించాలంటూ రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సొంతపార్టీకి చెందిన మహిళా ఎంఎల్‌ఎలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News