హైదరాబాద్: నగరంలోని కాసు బ్రహ్మనందరెడ్డి పార్కు(కెబిఆర్) ప్రవేశ రుసుం కొత్త సంవత్సరం నుంచి పెరగనుంది. ఇదే సమయంలో పార్కుల సందర్శన వేళలను కుదించనున్నారు. కొత్తగా పెంచిన రుసుం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సంవత్సరం ఫీజు(జనరల్) రూ.2,250 ఉండగా దానిని రూ.2500లకు పెంచారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఇయర్ పాస్‌లను రూ.1500ల నుంచి రూ.1700లకు నెలవారిగా ఉన్న రూ.600ల ఫీజును రూ.700లకు పెంచారు. అదేవిధంగా రోజువారిగా ఉన్న ప్రవేశ రుసంను సైతం భారీగా పెంచారు. పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.25లను వసూళ్లు చేయనున్నారు. ఒక వైపు ఫీజులను పెంచుతూ మరో వైపు పార్కు వేళలు సమయాన్ని కుదించనున్నారు. ఇక మీదట జనవరి 1వ తేదీ నుంచి ఉదయం 5 గంటల నుంచి 9.30 గంటలకు వరకు సాయంత్రం4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్‌కు, సందర్శనకు అనుమతించనున్నారు. ఇక మీదట అన్ని రకాల పాసులను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నిర్వహకులు సూచించారు.
పెరగనున్న కెబిఆర్ పార్కు ప్రవేశ రుసుం
- Advertisement -
- Advertisement -
- Advertisement -