హైదరాబాద్: చైనా లోన్ యాప్స్ స్కామ్లో మరో కేసు నమోదైంది. నకిలీ బిల్స్, సర్టిఫికెట్స్ ద్వారా రూ.1400 కోట్లు విదేశాలకు మల్లించినట్లు ఈడీ అధికారులు సిసీిఎస్ పోలీసులకు పిర్యాదు చేశారు. రూ.1400 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించిన కేసులో ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) బ్యాంక్ అధికారులను విచారించింది. బ్యాంక్ అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా పలు కీలక అంశాలు ఈడీ అధికారులు సేకరించారు. నిందితులు నకిలీ ఎయిర్ బిల్స్, నకిలీ 15సిబి సర్టిఫికెట్లు తయారు చేసి, వాటిని బ్యాంకులకు సబ్మిట్ చేసి విదేశాలకు నిధులను మల్లించినట్లు గుర్తించారు. ఈ నగదును నిందితులు.. హాంకాంగ్, మారిషస్ దేశాలకు ట్రాన్స్ఫర్ చేసినట్లు విచారణలో తేలినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. దీంతో చైనా లోన్ యాప్స్ స్కామ్లో మరో కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Another case filed in China loan App Scam