ఈనో,టీ, ఫెవీక్విక్ నకిలీ వస్తువులు తయారీ
హైదరాబాద్: సులభంగా డబ్బులు సంపాదించాలని నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 5.08 రూపాయల విలువైన ఈనో,టీ, ఫెవీక్విక్ నకిలీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని గోషామహల్‌కు చెందిన పుక్‌రాజ్ పురోహిత్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు నకిలీ వస్తువులు సరఫరా చేస్తున్నాడు. నకిలీ టీ ఫౌడర్, ఈనో, ఫెవీక్విక్ తయారు చేసి వివిధ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మనోజ్ మహేశ్వరీ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ సరఫరా చేస్తున్నాడు. ఇవి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. దర్యాప్తు కోసం బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు పరమేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పట్టుకున్నారు.