Saturday, November 23, 2024

రూల్స్‌కు విరుద్ధంగా 21 రోడ్లు మూసేశారు

- Advertisement -
- Advertisement -

Merge the cantonment in GHMC:KTR

 

మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే కంటోన్మెంట్‌ను జిహెచ్‌ఎంసిలో కలపాలి : కేంద్రమంత్రులకు మంత్రి కెటిఆర్ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులను ప్రశ్నించారు. రోడ్ల మూసివేతమై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డిలకు మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వారికి ట్వీట్ చేశారు. స్థానిక మిలటరీ సంస్థ నిబంధనల ఉల్లంఘనను కేంద్రం ఎందుకు అడ్డుకోలేకపోతుందని ఆయన ప్రశ్నించారు. మీ జూనియర్ మంత్రికి కంటోన్మెంట్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవని మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రి రాజ్ నాథ్‌సింగ్‌కు చేసిన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్‌లో 21 రోడ్లు నిబంధనలకు విరుద్ధంగా మూసివేశారని, కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 గేట్లు మాత్రమే మూసివేశామని చెబుతోందని, కంటోన్మెంట్ బోర్డు స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసిలో కలిపి వేయాలని మంత్రి కెటిఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News