Sunday, November 24, 2024

పేదవారికి గౌరవంతో కూడిన వైద్యం అందించేందుకు తెరాస ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

MLC Kavitha inaugurated Calvary Temple Hospital

 

మన తెలంగాణ/మాదాపూర్ : నిరుపేదలకు అత్యవసర వైద్యం నిమిత్తం అతి తక్కువ ధరలకే చికిత్సను అందించేందుకు కల్వరి టెంపుల్ హస్పిటల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మేల్సీ కవిత అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని కల్వరి టెంపుల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కల్వరి టెంపుల్ హస్పిటల్ ను కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలసి ఆదివారం ఆమే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతు కరోనా వంటి సమయంలో కల్వరి టెంపుల్ లో కోవీడ్ రోగులకు గతంలో 200 పడకలతో వైద్య సేవలు కల్వరి టెంపుల్ లో అందించారని, పర్మినెంట్ గా నిరుపేదలకు వైద్యం అందించేందుకు కల్వరి టెంపుల్ వారు ముందుకు వచ్చి హస్పిటల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు గౌరవంతో కూడిన వైద్యం అందించేందుకు తెరాస ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అదేవిధంగా నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్న కల్వరి టెంపుల్ కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్ధతు ఎల్లప్పుడు ఉంటుందని ఆమే పేర్కోన్నారు.

ఆకలికి కులమత బేధలు ఉండవని వైద్య సేవల నిమిత్తం హస్పిటల్ వచ్చిన రోగులకు ఉచితంగా బోజనం అందించడం ఎంతో అభినందనీమని, హస్పిటల్ కు వచ్చిన ప్రతి రోగిని డాక్టర్లు కాని నర్సులు కాని చిన్నచూపు చూడకుండా ప్రేమతో వారి బాధను తీర్చలని అన్నారు. తెరాస ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో అరుదైన సేవలు అందించిందని, చికిత్స నిమిత్తం హస్పిటల్ బిల్లులకు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా ఎంతో ఆసరను కల్పిస్తుందన్నారు. అధునాతన సౌకార్యలతో ఏర్పాటు చేసిన హస్పటల్ లో తక్కువ ధరలకే పేదవారికి వైద్య సేవలు అందిస్తూ పర్మినెంట్ హస్పిటల్ గా కల్వరి టెంపుల్ హస్పిటల్ నిలువాలని ఆకాంక్షిస్తున్నాట్లు ఆమే పేర్కోన్నారు. అనంతరం బ్రదర్ డాక్టర్ పి.సతీష్ కుమార్ మాట్లాడుతు నిరుపేదలకు అనుకూలమైన ధరలకే కల్వరి టెంపుల్ హస్పిటల్ లో చికిత్స నిర్వహించడం జరుగుతుందన్నారు.

వైద్యం కోసం వచ్చిన రోగులకు వాటర్ బాటిల్, టూత్ పెస్ట్, బ్రేష్, దువ్వెన, సబ్బు, షాంపు లను ఉచితంగా అందించడం జరుగుతుందని, బహుశ భారతదేశ చరిత్రలో జనరల్ వార్డు లేని హస్పిటల్ కేవలం కల్వరి టెంపుల్ హస్పిటల్ అని అన్నారు. ప్రతి పేషెంట్ కు డాక్టర్ నిర్ణయించిన డైట్ ప్రకారమే చక్కటి బోజనం ఉచితంగా అందించబడుతుందని, ప్రతి బెడ్ ఐసియూ లో ఉన్న సౌకార్యలతో ఉంటుందని, నిరంతరం డాక్టర్లు హస్పిటల్ లో అందుబాటులో ఉంటారని ఆయన పేర్కోన్నారు. కార్పోరేట్ హస్పిటల్ స్థాయిలో కులమత, ప్రాంతీయ బేధం లేకుండా కల్వరి టెంపుల్ హస్పిటల్ ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ సిబ్బంది, హస్పిటల్ వైద్యలు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News