Friday, November 22, 2024

మార్చి నాటికి ఎల్‌ఐసి ఐపిఒ రాకపోవచ్చు

- Advertisement -
- Advertisement -

LIC IPO may not arrive by March

విలువ లెక్కింపు ఆలస్యమే కారణం: అధికార వర్గాలు

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అనుకున్న సమయంలోగా ఈ సంస్థ విలువను లెక్కించే పనులు పూర్తి కాకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ పబ్లిక్ కంపెనీ వాల్యుయేషన్ పనులు ఇంకా పూర్తి కాలేదని, మరికొంత సమయం పట్టవచ్చని మర్చంట్ బ్యాంకర్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.

వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత కూడా జారీకి సంబంధించిన అనేక నియంత్రణ ప్రక్రియలను పూర్తి చేయడానికి సమయం తీసుకోనుంది. ఐపిఒపై స్పష్టత రావడానికి ముందు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ముందస్తు అనుమతి అవసరం అని అధికారి తెలిపారు. అంతేకాకుండా బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎఐ( ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఐఆర్‌డిఎఐ చీఫ్ పదవి దాదాపు ఏడు నెలలుగా ఖాళీగా ఉంది.

ఈ పరిస్థితిలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి ఐపిఒ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఎల్‌ఐసి పరిమాణం చాలా పెద్దది కావడం వల్ల ఎల్‌ఐసి విలువ లెక్కింపు చాలా క్లిష్టమైన ప్రక్రియగా ఉంది. దీని ఉత్పత్తి నిర్మాణం కూడా మిశ్రమంగా ఉంది. దీనికి రియల్ ఎస్టేట్ ఆస్తులు, అనేక అనుబంధ యూనిట్లు కూడా ఉన్నాయి. వాల్యుయేషన్ పనులు పూర్తయ్యే వరకు వాటా విక్రయం పరిమాణం కూడా నిర్ణయించలేమని మరో అధికారి తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఐపిఐ తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఐపిఒ కీలక పాత్ర పోషిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News