- Advertisement -
న్యూఢిల్లీ : జర్నలిస్టులకు ఎప్పుడేదైన అన్యాయం లేదా హింసాత్మక సంఘటనలు జరిగినా వారికి అండదండగా తాను ఉంటానని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం భరోసా ఇచ్చారు. మీడియా స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులపై జరిగిన దాడుల సమాచారం ట్విటర్‌లో పంచుకున్నారు. చాలా మంది మీడియా మిత్రులు ఒకే ఒక్క వ్యక్తి ముఖాన్ని పదేపదే చూపిస్తున్నారని, విపక్షాల గొంతు వినిపించక పోవడంతో అది ప్రజలకు చేరువ కావడం లేదని ఇది అత్యంత శోచనీయమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏది సరైనదనుకుంటే అదే చేయాలని, అలాంటప్పుడు అన్యాయం లేదా హింస జరిగితే తాను మీతోనే ఎప్పుడూ పోరాటానికి తోడుగా ఉంటానని జర్నలిస్టులకు ఆయన హామీ ఇచ్చారు.
- Advertisement -