- Advertisement -
న్యూఢిల్లీ : రాష్ట్రాలు కోరుకుంటే తమ స్కూళ్లలో వీలైతే విద్యార్థులకు భగవద్గీత బోధించవచ్చని సోమవారం లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర ముంబై బిజెపి ఎంపి గోపాల్ షెట్టి అడిగిన ప్రశ్నపకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి వివరించారు. రాష్ట్రాలు తమ స్కూళ్లలో కోరుకున్నమేరకు విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశంగా బోధించవచ్చని చెప్పారు. అలాగే భోజ్‌పురి భాషను కూడా స్కూళ్లలో బోధించవచ్చని సూచించారు. కొత్త విద్యావిధానం ప్రకారం పిల్లలకు తమ ప్రాంతీయ భాషల్లోనే విద్యాభోధన తప్పనిసరిగా జరగాలన్నారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ స్కూలు ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) సిలబస్‌లో వివిధ తరగతుల్లో భగవద్గీతను బోధిస్తున్నట్టు ప్రస్తావించారు.
- Advertisement -