నల్గొండ: జిల్లాలోని నిడమనూర్ మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని బొక్కమంతలపహాడ్ గ్రామంలో జల్లెపల్లి సూరయ్య అనే వ్యక్తి అల్లుడి కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తన కూతురు శ్యామలను అత్తింటి వారు ఇబ్బంది పెట్టి, కాపురానికి తీసుకెళ్లడంలేదనే కోపంతో రగిలిపోయిన సూరయ్య, అల్లుడి కుటుంబంపై మంగళవారం ఉదయం కత్తులతో దాడికి పాల్పాడ్డాడు. ఈ దాడిలో అల్లుడి తల్లి(అచ్చమ్మ) అక్కడికక్కడే మృతి చెందగా.. అల్లుడు శివనారాయన, అతడి తండ్రి బిక్షం, అమ్మమ్మ నారామ్మలు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Uncle attack with knife on Son in law family in Nalgonda