చెన్నై: తోటి విద్యార్థినులను బెదిరించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తుండడంతో సదరు యువకుడిని కిరాయి గుండాలతో హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం ఆరంబాక్కమ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుమ్మిడిపూండి ప్రాంతం పెద్ద ఓబులాపురం శివారులో ఓ మృతదేహాన్ని పాతిపెట్టిన విషయాన్ని స్థానికులు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు మన్నివాక్కానికి చెందిన ప్రేమ్‌కుమార్(20)గా గుర్తించారు. ప్రేమ్‌కుమార్ చెన్నైలోని మీనంబాక్కం కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. విద్యార్థినులు ఆడియో తీసి అతడి తల్లిదండ్రులకు పంపించారు. దీంతో మరింత రెచ్చిపోయి విద్యార్థినులను వేధింపులకు గురి చేశాడు. వేధింపులు బరించలేక అందరూ కలిసి కిరాయి రౌడీలతో ప్రేమ్‌కుమార్‌ను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారంలో తేలిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బెదిరింపులు… యువకుడి హత్య… చేయించింది విద్యార్థినులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -