- Advertisement -
హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహా రావు దేశంలో ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. పివి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు నివాళులర్పిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బహు భాషా కోవిదుడు, అన్ని భాషల్లో మాట్లాడగల వ్యక్తి, ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి పివి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం శత జయంతి వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, ఈ రోజూ ఆయన వర్ధంతిని చేస్తున్నామని, ఢిల్లీలో కనీసం పివి ఘాట్ లేదని, తెలుగు వారు అంటే కేంద్రానికి గౌరవం లేదని, పివి భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవించిందని తలసాని గుర్తు చేశారు. ఎన్నో పుస్తకాలు పివి మీద రాశారని, పుస్తక ప్రియులు అవి చదువుకోవాలని కోరారు.
- Advertisement -