Saturday, November 16, 2024

28న నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

- Advertisement -
- Advertisement -

No water supply parts of Hyderabad on 28th

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ లిమిటెడ్ (టిసిఐఐసిఎల్) అభివృద్ది పనుల్లో భాగంగా చేస్తున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఓఆర్‌ఆర్ పటాన్‌చెరు ఉనంచి ఓఆర్‌ఆర్ గచ్చిబౌలీ వరకు ఆరు లైన్ల రహదారిని విస్తరించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖానూపూర్ రిజర్వాయర్ నుంచి షేక్‌పేట జలశయానికి వెళ్ళే 1200 ఎంఎం డయా పిఎస్‌సీ పైపులైను జంక్షన్ పనులను జలమండలి చేపట్టనున్నామని ,ఇందులో భాగంగా ఈ నెల 28 ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు నీటిసఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ రిజ్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

నీటి సరఫరా ఉండని ప్రాంతాలు ఇవే.. 

ఆపరేషన్ మేనేజ్‌మెంట్ డివిజన్ నెం : 18 : మణికొండ మున్సిపాల్టీ, నార్సింగ్ మున్సీపాల్టీ ప్రాంతాలైన గండిపేట, కోకాపేట, నార్సింగీ, పుష్పాల గూడ, మణికొండ, ఖానాపూర్ ,నెక్నాంపూర్, మంచిరేవుల గ్రామాల పరిధిలో నీటి సరఫరా ఉండదని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాని సూచిస్తున్నారు. వినియోగదారులకు కలిగే ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని అధికారులకు సహకరించి సంస్థ ఆర్దికాభివృద్దికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News