నాగుపహాడ్ గ్రామ శివారులోని మూసీ నదిలో ఇసుక ఎత్తాలంటే నదిలో స్నానం చేసి గంగను కొట్టాలి
పర్మిషన్ ఉన్నా సరే
రాజ్యమేలుతున్న ఇసుకాసురుల రౌడీయిజం
మితి మీరుతున్న పెద్దరికాలు
మన తెలంగాణ/పెన్‌పసహాడ్ : నాగులపహాడ్ గ్రామ శివారులో మూసీ న దిలో ఇసుక ఎత్తడానికి ఊరి పెద్దమనుషుల, కొంతమంది యువకులకు ప ర్మిషన్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ పర్మిషన్ అక్కర లేదు. హైటెక్ యు గంలో ఇసుక దందాకు రుచి మరిగి ప్రమాణాలు చేయిస్తున్న పెద్ద మనుషు లు.. వివరాల్లో కెళ్తే పెన్‌పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రా మంలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇసుక వ్యా పారులు దౌర్జన్యాలకు దిగుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో కొత్తగా పెన్‌పహాడ్ మండల పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసు లు నమోదు చేసి అక్రమ ఇసుక తరలిస్తున్న వారిని కట్టడి చేస్తున్నాడు. ఈ సందర్భంగా నాగుపలహాడ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సుమారు ప దిహేను రోజుల క్రితం అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా అతని ఇ సుక ట్రాక్టర్‌ను తీసుకొని ఎస్సై కేసు నమోదు చేయడం జరిగింది.
అయితే గ్రామంలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులే పోలీసులకు సమాచారం అం దించి నా ఇసుక ట్రాక్టర్‌ను పట్టించారని హల్‌చల్ చేస్తూ గ్రామంలోని కొం దరు పెద్ద మనుషుల అండదండలతో ఇసుక ట్రాక్టర్ల యజమానులను గురువారం మూసి నదిలోకి తీసుకెళ్లి స్నానం చేయించి మూసి నది గంగాదేవి మీద ప్రమాణం చేసి నీ ఇసుక ట్రాక్టర్‌ని నేను పట్టించలేదంటూ 10 మంది ఇసుక ట్రాక్టర్ల యజమానులతో ప్రమాణం చేయించినట్లు సమాచారం. ఈ తతంగమంతా పెద్ద మనుషుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. అయితే ప్రమాణం చేయని వారెవరు ప్రభుత్వం పర్మిషన్ ఉన్న మూసీ నది నుండి ఇసుక తరలించడానికి అనర్హులని పెద్ద మనుషులు తేల్చారు. అయితే గ్రామస్తులు ఇలా చేయడం ఊరికి అరిష్టం అని హెచ్చరించిన కూడా వినకుండా దౌర్జన్యంగా ప్రమాణాలు చేయించినట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వం నుండి పర్మిషన్ తెచ్చుకున్నా కూడా వీరి అనుమతి లేకుండా మూసి నదిలో ఇసుక తోడేది లేదని గంగాదేవి మీద ప్రమాణం చేసిన వారే ఇసుక ట్రాక్టర్లు నడపాలని తీర్మానించారు. పర్మిషన్ ఉన్న ట్రాక్టర్లను కూడా ఇసుక ఎత్తకుండా ఇసుక కూలీలను సైతం భయబ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం. మండల వ్యాప్తంగా కొంత మంది పెద్ద మనుషులు అమాయకుల వీక్నెస్‌పై ఆసరాగా చేసుకొని ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.