Friday, November 22, 2024

సిఎం కెసిఆర్‌కు చిరంజీవి సహా సినీ ప్రముఖుల కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

Megastar Chiranjeevi thanks CM KCR

 

ఏపీలో టిక్కెట్ ధరల తగ్గింపుతో ఫిల్మ్‌మేకర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ కొత్త జీఓని తీసుకొచ్చింది. చిత్ర పరిశ్రమ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘’తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగించే నిర్ణయం ఇది” అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కి, మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపి సంతోష్ కుమార్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.

రియల్ ప్రాబ్లమ్ సాల్వర్ కేసీఆర్‌: ఎంపి సంతోష్‌కుమార్

మెగాస్టార్ చిరంజీవి తనకు ధన్యవాదాలు తెలపడం పట్ల ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో స్పందించారు. “నా బాధ్యతగా భావించి చిత్ర పరిశ్రమ సమస్య పరిష్కారానికి నా వంతు కృషిచేశాను. రియల్ ప్రాబ్లమ్ సాల్వర్ మాత్రం సీఎం కేసీఆరే. సీఎం ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు”అని సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నాః విజయ్ దేవరకొండ

రాష్ట్రంలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్… పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “నా ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న రాష్ట్ర సర్కార్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల సవరింపు” అని తెలియజేస్తూ టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News