Friday, November 15, 2024

పిల్లలకు టీకా

- Advertisement -
- Advertisement -

Covid vaccines for 15 to 18 year olds from January 3rd

15-18 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్

జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్‌డోసు
60ఏళ్లు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు
త్వరలో అందుబాటులోకి నాసల్, డిఎన్‌ఎ వ్యాక్సిన్
ఒమిక్రాన్‌పై వదంతులు నమ్మొద్దు, అప్రమత్తత అవసరం
దేశవ్యాప్తంగా అందుబాటులో 18లక్షల పడకలు
పిల్లలకు 90వేల బెడ్లు సిద్ధం
మందులకు కొరత లేదు, ఆరోగ్య కార్యకర్తల అంకితభావంలో వడివడిగా టీకాల పంపిణీ : జాతిని ఉద్ధేశించి ప్రధాని మోడీ ప్రసంగం

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి కొవిడ్ టీకాలు ప్రారంభిచనున్నట్లు వెల్లడించారు. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ప్రారంభిస్తామన్నారు. శనివారం రాత్రి జాతినుద్దేశిస్తూ ప్రధాని మోడీ ప్రసంగించారు. 60 ఏళ్లు పైబడినవారికి వైద్య నిపుణుల సలహామేరకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నామన్నారు. తొలిసారి నాసల్, డిఎన్‌ఏ ఆధారిత టీకా అందజేయబోతున్నామన్నారు. అ నూతన సంవత్సర వేడుకలను ఆరోగ్యకరంగా జరుపుకోవాలని ప్రధాని సూచించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని, శుభ్రత పాటించాలని సూచించారు. అయితే, ఆందోళన అవసరంలేదని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇన్‌ఫెక్షన్లు పెరిగితే తగిన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ వాటి గురించి వివరించారు.

దేశంలో ఇప్పుడు 18 లక్షల ఐసోలేషన్ పడకలు, ఐదు లక్షల ఆక్సిజన్ బెడ్లు, 1.4 లక్షల ఐసియు పడకలు, 90,000 ప్రత్యేక పడకలు చిన్నారులకు అందుబాటులో ఉన్నాయని ప్రధాని తెలిపారు. 3000 ఆక్సిజన్‌ప్లాంట్లు, నాలుగు లక్షల ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రాలకు పంపినట్టు ప్రధాని తెలిపారు. దేశంలో ఔషధాలకు కొరత లేదని ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 61శాతం వయోజనులకు రెండు డోసులు, 90 శాతానికి ఒక డోస్ టీకాలు అందాయని ప్రధాని తెలిపారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని మోడీ పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వల్ల ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అయితే భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని, ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలన్నారు. దేశంలో ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే 100శాతం టీకా కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. 11మాసాలుగా టీకా ఉద్యమం కొనసాగుతోందని, భవిష్యత్‌లో కూడా అంతా సహకరించాలని ప్రధాని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News