దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
జోహెన్స్‌బర్గ్: నెల్సన్ మండేలాను నిర్బంధించిన రాబెన్ ద్వీపంలోని జైలు తాళం చెవి(కీ) వేలంను అడ్డుకునేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ఆ దేశ సాంస్కృతికశాఖమంత్రి నాథీతేత్వా తెలిపారు. అమెరికాకు చెందిన గ్వెర్న్‌సే అనే వేలం కంపెనీ జనవరి 28న వేలం నిర్వహించనున్నట్టు ప్రకటిం చింది. వేలం జరిగితే ఆ తాళం చెవి కొన్ని మిలియ న్ పౌండ్లకు అమ్ముడు కానున్నట్టు అంచనాలున్నా యి. నల్లజాతీయుల హక్కుల కోసం సుదీర్ఘ పోరా టం జరిపిన నేతగా నెల్సన్ మండేలాకు పేరున్నది. 27 ఏళ్ల జైలుజీవితం అనుభవించిన మండేలాను 18 ఏళ్లపాటు ఇప్పుడు వేలానికి పెట్టిన జైలులోనే నిర్బంధించారు.
ఆ సమయంలో జైలర్‌గా ఉన్న క్రిస్టోబ్రాండ్‌కు జైలు కీ ఇచ్చారు. దానిని వేలం కోసం గ్వెర్న్‌సేకు బ్రాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష తొలగిపోయిన తర్వా త ఏర్పాటైన మొదటి ప్రభుత్వానికి నెల్సన్‌మండేలా అధ్యక్షుడయ్యారు. 1994 మే నెల నుంచి 1999 జూన్ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2013 డిసెంబర్‌లో 95 ఏళ్ల వయసులో మండేలా మరణించారు. చారిత్రక వ్యక్తిగా మండేలాకు గు ర్తింపు ఉంది. దక్షిణాఫ్రికా ప్రజలకు ఆయన స్ఫూర్తి ప్రదాత. దాంతో, ఆ జైలుకు సంబంధించిన అంశా న్ని గంభీరమైనదిగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొన్నది. అది జాతీయ స్మారకమని, 1999లో దానిని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో ప్రకటిం చిన విషయాన్ని గుర్తు చేసింది.