హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూ నివర్సిటీ, సెట్విన్,హైదరాబాద్ బలహీన వర్గాల అభి వృద్ధి సంక్షేమ సంఘంతో కలిసి ఎస్‌ఎస్‌సి, ఇంటర్, గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం మొదటి మెగా ఉర్దూ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. 2022 జనవరి 6న గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నే షనల్ ఉర్దూ యూనివర్శిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు ఆమోదించబడతాయని తెలంగా ణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ గౌస్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ అభ్యర్థులు, ఎస్‌ఎస్‌సి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయే షన్‌లో ఉర్దూ మీడియం లేదా ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఈ నెల 31 వరకు https://forms.gle/a pSp158 5x47fAYaHA ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. తెలం గాణ రాష్ట్రంలోనే ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం ఇదే మొదటిసారి అని, ఇందులో ప్రఖ్యాత ఐటీ కంపె నీలు, బ్యాంకులు, ఫైనాన్స్ మరియు పాలసీ మేకింగ్ సంస్థలు, జర్నలిజం, హాస్పిటల్స్, టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమ పాల్గొంటాయని అన్నారు. జాబ్ మేళాలో అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందుగా తమ బయోడేటా ఫారం 10 సెట్లతో పాటు అవసరమైన అ న్ని పత్రాలతో హాజరు కావాలని ఆయన తెలిపారు. వి వరాలకు 040-23237810, 23008413, 35934 083 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అన్నారు.