కృష్ణ-గోదావరి ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చే అంశంపై కీలక నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణ-గోదావరి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చేందుకుగాను గెజిట్ నోటిఫికేషన్ అమలు తీరుపై మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాల అధికారులతో కృష్ణ, గోదావరి నదు ల యాజమాన్య చైర్మన్లు ఇతర అధికారు లు ఈ సమావేశంలో పాల్గొన్ననున్నారు. వర్చు వల్ విధానంలో మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కు మర్ ఈ సమావేశం నిర్వహించను న్నారు. గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వ హించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకు న్న నిర్ణయాలు, కృష్ణ, గోదావరి యాజమాన్య బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింత, నీటిపారుదల శాఖలకు చెందిన సిబ్బంది అప్పగింత, అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్‌లను బో ర్డులకు, కేంద్ర జలశక్తి సమర్పించడం, బోర్డుల నిర్వహణకు తెలుగు రాష్ట్రాల నుంచి చెరో రూ.200కోట్లు అందజేయడం, ప్రాజెక్టుల భద్రతకు సిఐఎస్‌ఎఫ్ బలగాల ఏర్పాటు తదితర అంశాలను సమావేశంలో సమీక్షించనున్నారు.