Monday, November 18, 2024

నేడు ఒవైసి ప్లైఓవర్‌ను ప్రారంభించనున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నేడు ఓవైసీ ప్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ప్రాజెక్టు వ్యయం రూ. 80 కోట్లు
ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 63 కోట్లు, భూసేకరణకు రూ. 17 కోట్లు
దక్షిణ ప్రాంతంలో తొలిసారిగా ఫ్రీక్యాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఫ్లైఓవర్

KTR inaugurated OYC Fly over

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఎల్‌బినగర్ ఆరాంఘర్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు గాను ఓవైసీ, మిథాని చౌరస్తా మధ్య నిర్మించిన ఓవైసీ మల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్ ప్లైఓవర్‌ను ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పురపాలక శాఖ మంత్రి కె.తారాకరామారావు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపిలు కె.కేశవరావు, అసదుద్ద్‌న్ ఓవైసీ, రేవంత్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్సీలు సయ్యద్ అమినుల్ జాఫ్రీ, మీర్జా రియాజుల్ ఆఫ్రీది, యోగ్గె మలేశం, సురభి వాణి దేవి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ , జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ మో తె శ్రీలత శోభన్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీధర్, పాల్గొననున్నారు.

రూ.80 కోట్లతో ప్లై ఓవర్ నిర్మాణం

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వయా దక్షిణ ప్రాంతం గుండా సులువుగా తూర్పు ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా అత్యంత వాహన రద్దీగల ఎల్‌బినగర్ ఆరాంఘర్ మార్గంలో ఓవైసీ జంక్షన్ వద్ద ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.80 కోట్లు కాగా ఇందులో రూ.63 కోట్లు ప్లైఓవర్ నిర్మాణానికి, మిగిలిన రూ.17 కోట్లు భూసేకరణకు ఖర్చు చేశారు. దక్షిణ ప్రాంతంలో ఫ్రీ క్యాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన తొలిప్లైఓవర్ ఇదే కా వడం విశేషం. అదేవిధంగా మూడు లైన్లలో వన్‌వే మార్గంగా నిర్మించిన ఈ ప్లైఓవర్‌పైన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్లైఓవర్ అందుబాటులోకి రానుండడంతో ఈ మార్గంలో అత్యధికంగా కేంద్ర ప్ర భుత్వ సంస్థలు ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే మార్గం కూడా కావడంతో ట్రాఫిక్ సమస్య తలేత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలకు మార్గం సుగమణమైంది.

ఈ మార్గంలో మొత్తం 7 ప్రాజెక్టులు

ఎల్‌బినగర్ ఆరాంఘర్ మార్గం మధ్య ఎస్‌ఆర్‌డిపి కింద మొత్తం 7 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో 5 ప్లైఓవర్లలో ఓవైసీ ప్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. అదేవిధంగా ఒక అండర్ పాస్‌తోపాటు మరో ఆర్‌ఓబి పనులను నల్గొండ ఓవైసీ కారిడార్ ప్లైఓవర్, చాంద్రాయణగుట్ట ప్లైఓవర్ పొడిగింపు, బహదూర్‌పుర, ఆరాంఘర్ నుంచి జూపార్క్ కారిడార్ ప్లైఓవర్, ఫలక్‌నుమాఆర్‌ఓబి, ఉప్పుగూడ ఆర్‌యుబి పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు సైతం 2022 మార్చి చివరినాటికి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News