Sunday, November 24, 2024

చైనా స్పేస్ స్టేషన్‌కు ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో ముప్పు

- Advertisement -
- Advertisement -
Elon Musk threatens China space station with Starlink
యుఎన్ స్పేస్ ఏజెన్సీకి ఫిర్యాదు

బీజింగ్ : అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ స్పేస్ రాకెట్ల వల్ల తమ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ముప్పు వాటిల్లినట్టు చైనా ఆరోపించింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియా సమావేశంలో వివరాలు తెలియచేశారు. ఈ ఏడాది జులై1, అక్టోబర్21 న ఎలాన్ మస్క్‌కు చెందిన స్సేస్ ఎక్స్ శాటిలైట్ లింకులతో తమ స్పేస్‌స్టేషన్‌ను ఢీకొనే ప్రమాదం ఏర్పడిందని, ఆ సమయంలో తమ స్సేస్ స్టేషన్‌లో చైనా వ్యోమగాములు తమ విధులు నిర్వర్తిస్తున్నారని, అయితే రక్షణ చర్యలు చేపట్టి ఆ శాటిలైట్ల నుంచి ప్రమాదాన్ని తప్పించ గలిగామని ఝావో తెలియచేశారు. ఈమేరకు డిసెంబర్ 3న యుఎస్ స్పేస్ ఏజెన్సీకి యుఎస్ స్రెకటరీకి ఫిర్యాదు చేసినట్టు ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమెరికాను కోరినట్టు ఝావో తెలిపారు. భూమికి 390 కిమీ ఎత్తులో కక్ష వలయంలో చైనా స్సేస్ స్టేషన్ తియాన్‌గాంగ్‌ను గత ఏప్రిల్ 29 న చైనా ప్రారంభించింది. అప్పటి నుంచి స్సేస్ స్టేషన్ నిర్మాణం కోసం చైనా రెండు బ్యాచ్‌ల వారీగా ముగ్గురు వ్యోమగాములను పంపించింది. అక్టోబర్‌లో ఒక మహిళతోపాటు ముగ్గురు వ్యోమగాములను పంపింది. ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రం వచ్చే సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకుంటుందని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News