న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,195 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో నిన్నటి కంటే 44 శాతం అధికంగా కేసులు పెరిగాయి. కరోనాతో మరో 302మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,80,592మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,002. కరోనా యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.
India Reports 9195 new corona cases in 24 hrs