అమన్ : జోర్డాన్ పార్లమెంటు దిగువ సభలో మంగళవారం కొందరు ఎంపిలు కొట్టుకున్నారు. రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వివాదం చెలరేగింది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఎంపిలు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సమాన హక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జోర్డాన్ పార్లమెంట్‌లో మంగళవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ ప్రతిపక్ష ఎంపీ మాట్లాడుతూఏ ఈ బిల్లు పనికిరానిదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ఆ సభ్యుడు నిరాకరించడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఘర్షణకు దారి తీసింది. ఇదంతా మీడియా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఎంపీల బాహాబాహీతో సభ వాయిదా పడింది. ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి.
జోర్డాన్ పార్లమెంట్‌లో ఎంపిల ముష్టి యుద్ధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -