Saturday, November 23, 2024

లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Mastermind of Ludhiana court explosion arrested

 

న్యూఢిల్లీ : పంజాబ్ లోని లూథియానా కోర్టు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న జర్మనీకి చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీ పోలీసులకు పట్టుబడ్డాడు. సెంట్రల్ జర్మనీ లోని ఎర్పార్ నుంచి ఫెడరల్ పోలీసులు ముల్తానీని అదుపులో తీసుకున్నారు. లూథియానా బాంబు పేలుళ్ల ప్రాథమిక విచారణలో ముల్తానీ పేరు బయటపడింది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టార్ హర్విందర్ సింగ్ ద్వారా లూథియానా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడు. ముల్తానీని విచారించడానికి భారత్ దర్యాప్తు సంస్థలు త్వరలో జర్మనీకి వెళ్లే అవకాశముంది. పంజాబ్ పోలీసుల నుంచి డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌ను లూధియానా పేలుళ్లకు ఉపయోగించుకున్నట్టు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News