మనతెలంగాణ/హైదరాబాద్ : హజ్ -2022 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వృద్ధుల గరిష్ఠ వయో పరిమితిని రద్దు చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఈఒ బి. షఫివుల్లా తెలిపారు. 65 ఏళ్లు దాటిన యాత్రికులు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి అర్హులు. 70+ ఉద్దేశించిన యాత్రికుల దరఖాస్తులు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం రిజర్వ్ చేయబడిన కేటగిరీ కింద నమోదు చేయబడతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం www.hajcommittee.gov.inని సందర్శించాలని సూచించారు.040 -24298793 నంబర్లో సంప్రదించాలని కోరారు.
ఎకె ఖాన్కు మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (మైనారిటీ వెల్ఫేర్) ఎకె ఖాన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది. ఈ నెల 31వ తేదీతో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. కాగా మరో ఏడాది పాటు ఆయనను ప్రభుత్వ సలహాదారుగా కొనసాగించాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.