2021లో ముగ్గురు స్టార్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్‌తో ప్రేక్షకులను అభిమానులను ఎంతగా నో అలరించారు. ఈ స్టార్లు తమ సినిమాలతో బాక్సాఫీస్‌ని ఓ రేంజ్లో షేక్ చేసి భారీ వసూళ్లని రాబట్టి టాలీవుడ్‌కి కొత్త ఉత్సాహాన్ని అం దించారు. రవితేజ ‘క్రాక్’, బాలకృష్ణ ‘అఖండ’, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాలిచ్చిన జోష్‌తో కొత్త ఏడాది ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేసేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఇవేగాకుండా ఈ ఏడాది నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రా లు కూడా మంచి విజయాన్ని అందుకొని తెలు గు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహానిచ్చాయి.
స్టార్లు అదరొట్టారు..
ఈ ఏడాది జనవరి 9న సంక్రాంతికి విడుదలైన రవితేజ చిత్రం ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచిం ది. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, లేదా అనే అనుమానాలను పటాపంచ లు చేస్తూ టాలీవుడ్‌కు పెద్ద భరోసానిచ్చిన చిత్రమిది. ఈ సినిమా 38 కోట్లు వసూలు చేసి ప్రేక్షకులను అలరించింది. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ గర్జనకు బాక్సాఫీస్ షేక్ అయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 63 కోట్లు షేర్ తెచ్చింది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలు, బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలైంది.
తిరుగులేని విజయాలు..
ఈ ఏడాది మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం 38 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం 51 కోట్లు షేర్ వసూలు చేయడం విశేషం. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం దర్శకుడు శేఖర్ కమ్ములకు మరో సూపర్ హిట్‌ను అందించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు షేర్ వసూలు చేసింది.