Thursday, April 17, 2025

ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

Ganguly discharged from hospital

 

కోల్‌కతా: కరోనా బారిన పడిన భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో అతను శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అయితే గంగూలీని మరో 15 రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. మరో రెండు వారాల పాటు గంగూలీ తన ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నాడు. ఈ విషయాన్ని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా కరోనా పాజిటివ్ రావడంతో గంగూలీ సోమవారం రాత్రి వుడ్‌ల్యాండ్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరాడు. తాజాగా శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News