- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా పాజిటీవ్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. శనివారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,431కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఒమిక్రాన్ నుంచి 488మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 454 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 351, కేరళలో 109, తమిళనాడులో 118, గుజరాత్‌లో 115 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
India Reports 1431 Omicron Cases
- Advertisement -