- Advertisement -
విరుధునగర్ (తమిళనాడు): తమిళనాడు లోని విరుధునగర్ జిల్లా నాగాలాపురం గ్రామం మారు మూల ప్రాంతం మెట్టుపట్టి కమ్మకారైలో శనివారం బాణాసంచా తయారీ భవనంలో పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రసాయన పదార్ధాలను సరిగ్గా నిర్వహించక పోవడం వల్ల పేలుడు సంభవించిందా లేక మరేదైనా కారణమా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే రసాయన పదార్ధాలను నిల్వ చేసే స్టోరేజి తలుపు తెరవగానే పేలుడు సంభవించిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. పేలుడు పదార్దాలను సరిగ్గా నిల్వ చేయకపోవడమే దీనికి కారణమన్న మరో వాదన వినిపిస్తోంది.
- Advertisement -