- Advertisement -
హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం నగరంలోని పివి ఎన్నార్ ఎక్స్ ప్రెస్ వే 190 పిల్లర్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Young Man Killed in Road Accident in Hyderabad
- Advertisement -