- Advertisement -
అఖిలేశ్ వ్యాఖ్యలపై యుపి సిఎం యోగి ధ్వజం
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం శ్రీకృష్ణుని ప్రస్తావనతో వేడెక్కుతోంది. కృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కృష్ణుడు చెబుతున్నాడని, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కృష్ణభగవానుడు వారిని శపిస్తాడని మాజీ సిఎం అఖిలేశ్‌కు పరోక్షంగా జవాబు ఇచ్చారు. కొంతమందికి కృష్ణపరమాత్ముడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. వారి వైఫల్యాలకు ఇప్పుడైనా చింతించాలని చెప్పి ఉంటాడు. మీరు (అఖిలేశ్‌ను ఉద్దేశిస్తూ ) చేయలేనిది బిజెపి ప్రభుత్వం చేసి చూపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మధుర, బృందావనం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తూ భగవాన్ శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తున్నాడు. అని యోగి వ్యాఖ్యానించారు.
- Advertisement -