Tuesday, December 24, 2024

తగ్గేదే లే అంటున్న కృతిశెట్టి..

- Advertisement -
- Advertisement -

Krithi Shetty speaks about bold Scenes

యంగ్ బ్యూటీ కృతిశెట్టి అందం, అభినయం కలబోతతో తొలి సినిమా ‘ఉప్పెన’తో తానేంటో నిరూపించుకుంది. ఆరంగేట్రమే హద్దులు మీరి రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగింది. అదేవిధంగా నటిగా మంచి పేరు సంపాదించింది. ‘ఉప్పెన’ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయింది. ఇటీవల నేచురల్ స్టార్ నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’లోనూ హాట్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. మరోసారి లిప్‌లాక్ సన్నివేశాల్లో కృతి శెట్టి సత్తా చాటింది. సీన్ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం ఆలోచించనని..వెనక్కి తగ్గేదే లేదని ఓపెన్‌గా చెప్పింది ఈ ముంబయ్ బ్యూటీ. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పడు మరో సక్సెస్ అందుకొని హ్యట్రిక్ హిట్ భామగా నిరూపించుకోవాలని ఆశపడుతోంది. ప్రస్తుతం కృతి చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సుధీర్ బాబు సరసన నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు ఒకటి చెప్పాలి’ అనే సినిమా ఆన్ సెట్స్‌లో ఉంది.

ఇందులోనూ సుధీర్ బాబుతో రొమాంటిక్ సన్నివేశాల్లో కృతి హద్దులు మీరిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో ఆ హింట్ పబ్లిక్‌కి అందేసింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కాబట్టి సన్నివేశాలు నాటకీయంగా ఉండొచ్చు. అయితే ఈ సినిమాతో కృతి శెట్టికి మంచి పేరు వస్తుందని అంటున్నారు. ఏదేమైనా ఈ ముంబయ్ బ్యూటీ అన్నింటికీ సిద్ధంగానే ఉందట. ఇక కృతి ‘బంగార్రాజు’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఉంటుందని తెలిసింది. అలాగే లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో తెరకెక్కనుంది. నితిన్ సరసన ‘మాచర్ల నియోజక వర్గం’లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ.

Krithi Shetty speaks about bold Scenes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News