Friday, December 20, 2024

కరోనాపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకి మైండ్ సిస్టంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి కోసం కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ”కరోనా సోకిన వ్యక్తి మూడు రోజుల వరకు జ్వరము లేదా జలుబు, దగ్గు లేకుంటే ఏడు రోజులు ఐసోలేషన్ లో ఉండాలి. కరోనా సోకిన బాధితులు తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలి అదికూడా త్రిబుల్ లేయర్ మాస్కూల్ ధరించాలి. ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు వెంటిలేషన్ బాగా ఉన్నా రూమ్ లో ఉండాలి. ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలి. కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలి.

కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌-95 మాస్క్‌ను ఉపయోగించాలి. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్‌ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదు. బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలి. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు” అని కేంద్రం సూచనలు చేసింది.

 Centre Govt releases new guidelines for corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News