న్యూఢిల్లీ: దేశంలో 15-18 వయసు లోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసు ప్రారంభించిన మొదటి రెండు రోజుల్లోనే 39.8 శాతం మందికి వ్యాక్సిన్ అందచేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ వయసు పిల్లలకు మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను అందచేసిన రాష్ట్రాలలో రెండవ స్థానంలో 37 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 30.9 శాతంతో మూడవస్థానంలో గుజరాత్ ఉన్నాయని అధికారులు తెలిపారు. 15-18 వయస్కులకు దేశంలో జనవరి 3న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 85 లక్షల మందికి పైగా మొదటి డోసు ఈ రెండు రోజులలో వేసుకున్నారు. దాద్రా నాగర్ హవేలీ, దామన్ డయ్యూలో 28.3 శాతం మందికి, కర్నాటకలో 25.3 శాతం మందికి, ఉత్తరాఖండ్‌లో 22.5 శాతం, మధ్యప్రదేశ్‌లో 20.6 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 20.5 శాతం మంది పిల్లలకు వ్యాక్సినేషన్ జరిగినట్లు అధికారులు చెప్పారు. వీరికి కోవ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వారు చెప్పారు.
AP top with 39.8% vaccination of 15-18 age group